ఈమధ్య భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త '2022 జీప్ కంపాస్ ట్రయిల్‌హాక్' (2022 Jeep Compass Trailhawk) భారతదేశంలోని 'థార్ ఎడారి' (గ్రేట్ ఇండియన్ డిసార్ట్) దాటిన మొదటి SUV కార్ గా మంచి రికార్డ్ సాధించింది. ఈ కొత్త జీప్ ట్రయిల్‌హాక్ మొత్తం మీద దాదాపుగా 1,200 కిలోమీటర్ల ఆఫ్ రోడ్‌ను కవర్ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించడం జరిగింది.ఇది నిజంగా చాలా గొప్ప అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.ఇక కంపెనీ యొక్క ఈ కొత్త SUV కార్ ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెలు ఇంకా రాతి ప్రాంతాలు అలాగే ఉప్పు మైదానాల గుండా ప్రయాణించి తన సామర్థ్యాన్ని ఋజువు చేసుకుంది. ఇక జీప్ కంపాస్ ట్రయిల్‌హాక్ SUV థార్ ఎడారిలో 1,200 కి.మీ ప్రయాణానికి 72 గంటల సమయం పట్టింది. ఈ కంపాస్ ట్రైల్‌హాక్ ఈ ఎడారిలో ప్రయాణించే సమయంలో పగటిపూట 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల ఎదుర్కొని ఇంకా అలాగే రాత్రిపూట దాదాపు గడ్డకట్టే చలి వంటి పరిస్థితులను కూడా చాలా విజయవంతంగా ఎదుర్కోగలిగింది.


ఇక మొత్తం మీద జీప్ కంపాస్ ట్రయిల్‌హాక్ రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ నుండి గుజరాత్‌లోని కచ్‌ దాకా ప్రయాణించింది. ఈ సమయంలో SUV కార్ తీవ్ర ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలైన అలీసర్, బికనేర్, ధని, సేనా డూన్స్, ఛోటే రాన్, కాలా దుంగార్, వర్జిన్ డ్యూన్స్, బార్నర్, జైసల్మేర్ ఇంకా అలాగే కచ్ ప్రాంతాల గుండా వెళ్లింది. ఇందులో అనేక ఇసుక దిబ్బలు ఇంకా అలాగే రాతి మార్గాలను కూడా అవలీలగా దాటగలిగింది.ఇక జీప్ కంపెనీ తన 'కంపాస్ ట్రైల్‌హాక్' (Compass Trailhawk) SUV ని గత నెలలో రూ. 30.72 లక్షల ప్రారంభ ధర వద్ద రిలీజ్ చేసింది. 2022 జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది కొత్త హెడ్‌ల్యాంప్‌లు ఇంకా అలాగే గ్రిల్‌ కలిగి ఉంది.


ఇక అంతే కాకూండా ఇది మరింత ఆకర్షణీయంగా కూడా కనిపించడం కోసం ఇందులో షార్ప్‌గా కట్ బంపర్‌లు కూడా ఉంటాయి. ఇది కొత్త బోనెట్ డెకాల్ ఇంకా అలాగే చిన్న 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇంకా 225/65 R17 సెక్షన్ టైర్లను పొందటమే కాకుండా.. రియర్ రెడ్ హుక్ ఇంకా స్కఫ్ ప్లేట్ అలాగే ఫెండర్‌లపై కొత్త ట్రయల్ రేటింగ్ బ్యాడ్జ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇక ఇవన్నీ కూడా దీనిని మరింత దూకుడుగా కనిపించేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: