సాధారణంగా మొటిమలు ఆయిల్ ఫేస్ ఎక్కువగా ఉన్నవారికి వస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ముక్కు పైన, బుగ్గల  పైన, నుదుటిపైన  T ఆకారంలో మొటిమలు వస్తూ ఉంటాయి. అయితే ఈ మొటిమలు ముఖం మీద ఎర్రగా,  నొప్పిని కలిగిస్తాయి. ఇక మీకు గడ్డం మీద మొటిమలు వస్తుంటే..మీరు చింతించకండి.. మీకోసం కొన్ని చక్కని చిట్కాలు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం.. అవేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా..!

గడ్డం మీద మొటిమలు కనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఒత్తిడి. గడ్డం మీద మొటిమలు ఎక్కువగా కనిపించడానికి కొన్ని ముఖ్యమైన ప్రధాన కారకాల్లో ఒత్తిడి కూడా ఒకటి. మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి అయినప్పుడు, అత్యధికంగా సెబం ఉత్పత్తి అవుతుంది . ఫలితంగా  మీ ముఖం మీద లేదా గడ్డం మీద మొటిమలు వస్తాయి. ఇక ఒత్తిడి,నిద్రలేమి,ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.

మహిళలలో ఎక్కువగా శరీరంలో ప్రొజెస్టిరాన్ తోపాటు ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల గడ్డ మీద మొటిమలు ఆకస్మికంగా వస్తూ ఉంటాయి.  ఈ రెండు హార్మోన్లు అధికంగా నూనెల ఉత్పత్తి కి కారణమవుతాయి. ఎందుకంటే ఈ రెండు హార్మోన్ల స్థాయిలు పెరిగినప్పుడు, సెబాసియం గ్రంధులు,ఎక్కువగా సెబం ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా మీరు జనన నియంత్రణ మాత్రలు తీసుకుటుంటే,శరీరంలోని ఆండ్రోజన్ స్థాయిలు తగ్గుతాయి. ఇక ఎప్పుడైతే ఈ మాత్రలు తీసుకోవడం ఆపేస్తారో, అప్పుడు సెబం అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా మొటిమలు వస్తాయి.

అయితే వీటికి చికిత్స ఎలా చేయాలి అంటే..ఓరల్ యాంటీబయాటిక్ చికిత్సలను పాటించాల్సి ఉంటుంది. లేజర్ లేదా లైట్ థెరపీ ని చేయించడం వల్ల మొటిమలు రావడానికి నివారించవచ్చు. మరీ ముఖ్యంగా ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కూరగాయలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో బ్రోకలీ, బచ్చలికూర,ఆకుపచ్చ కూరగాయలు చేర్చుకోవడం వల్ల ఈ మొటిమలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా బీటాకెరోటిన్, జింక్ ఉత్పత్తులు కలిగిన  ఆహారం తీసుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: