చాలామంది అందం కోసం ఎన్నో రకాల కాస్మెటిక్స్,  ఫేస్ క్రీములు రాస్తూ మచ్చలు, మొటిమలు లేని ముఖం కోసం తహతహలాడుతుంటారు. ఇక ఇవన్నీ పక్కనపెడితే పై పెదవి మీద అలాగే గడ్డం కింద చిన్న చిన్న వెంట్రుకలు రావడం గమనించే ఉంటారు. అయితే వాటిని కొంతమంది రేసర్ సహాయంతో తొలగించుకుంటే, మరి కొంతమంది పసుపు లాంటి పదార్థాలను ఉపయోగించి తీసుకుంటున్నారు. అయితే ఒకసారి తీసిన తర్వాత ఇది చాలా మందంగా వస్తున్నాయ్ అని కూడా వారు వాపోతున్నారు. అయితే అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..



ముందుగా మీ అప్పర్ లిప్ పై ఉండే అవాంచిత రోమాలను వాక్స్ ద్వారా తొలగించుకోవాలి. ఆ పై రోమాలు త్వరగా పెరగకుండా ఉండేందుకు ఇంట్లో ఉండే పదార్థాలతో ప్యాక్ తయారు చేసుకొని, వాటిపై అప్లై చేసి, నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా చేసుకోవాలి అంటే అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్ స్పూన్ బియ్యపిండి. ఈ మూడింటిని బాగా కలిపి పేస్టు లాగా తయారు చేసుకోవాలి.


ఈ మిశ్రమాన్ని మీరు వ్యాక్సింగ్ చేసిన ప్రదేశంలో అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే అవాంఛితరోమాలు త్వరగా రాకుండా ఉంటాయి. ఇక నుదురు, గడ్డం, పెదాలపై నల్లగా ఉందంటే, అందుకోసం కూడా ఒక బంగాళదుంప ప్యాక్ ను చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బంగాళాదుంపలు కడిగి తొక్క తీసి వేయాలి.


చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, గ్రైండర్ లో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా శెనగపిండి, తేనె కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకొని, ఎక్కడైతే ముఖం మీద నల్లగా ఉందో, ఆ ప్రదేశాలలో వీటిని పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల అవాంచిత రోమాలు తొలిగిపోతాయి. అలాగే చర్మం నిగనిగలాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: