సాధారణంగా అయితే ఒక అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటూనే, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అయితే చాలా మంది ముఖం మీద మొటిమల తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు మరొక చర్మ సమస్య వారిని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది.. అదేమిటో కాదు సోరియాసిస్.. ఈ సోరియాసిస్ వచ్చిన తర్వాత ముఖం మీద తెల్లని మచ్చలు లాగ ఏర్పడి, చూడడానికి అందవిహీనంగా కనిపిస్తారు. అయితే ఈ సమస్యలు తగ్గించుకోవాలంటే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలాంటి కష్టం లేకుండా ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం, ఇంట్లో ఉంటూనే ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


అయితే ఇటీవల కాలంలో ఒక డయాబెటిస్ ఎడ్యుకేటర్ తన అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చాడు. సాధారణంగా తరచూ జీర్ణసమస్యలు,  రోగనిరోధక శక్తి లేమి లాంటి సమస్యల వల్ల చర్మ సంబంధ వ్యాధులు వస్తాయని, ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ లేదని.. వీటి ద్వారా సూక్ష్మ జీవులు నేరుగా చర్మ ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
అయితే చర్మం పై తామర, మొటిమలు, సోరియాసిస్, నుదురు, బుగ్గలపై వాపులు వంటి వ్యాధులను నివారించేందుకు కొన్ని సులభమైన మార్గాలను ఈ డయాబెటిస్ ఎడ్యుకేటర్ తన ఇంస్టాగ్రామ్  పోస్టు ద్వారా పంచుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


మీరు తీసుకునే ఆహారంలో మంట కలిగించని పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాజా ఆకుపచ్చ కాయగూరలు, పసుపు, దాల్చినచెక్క, సాల్మన్ ఫిష్, శుద్ధమైన తేనె లాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇక సున్నితమైన ఆహారం, త్వరగా జీర్ణమయ్యే ఆహారం, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఉండే పోషక ఆహారాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇక మీ రెగ్యులర్ డైట్ లో గ్లూటెన్ చక్కెర వంటివి తొలగించండి. ఇలా చేస్తే పదహైదు రోజుల్లోనే ఫలితం కనబడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇక ఒమేగా త్రి,విటమిన్ డి, విటమిన్ ఇ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఇక అలాగే ప్రతి రోజుకు అవసరమైన నిద్ర కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి తగ్గించుకొని రోజు వ్యాయామం, యోగ లాంటివి చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: