మగువలు అందవిహీనంగా కనిపించడానికి మొటిమలు, మచ్చలు ఎలా కారణమవుతాయో, వయసు పైబడే కొద్దీ ముడతలు  వచ్చి ముఖం అందవిహీనంగా కనబడుతుంది. అయితే ఈ ముడతలను తగ్గించుకోవడం కోసం చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ తరచుగా చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్యం తరచుగా చర్మ రుగ్మతలకు కారణమవుతోంది.. అయితే ఇలాంటి వృద్ధాప్య ఛాయలను తొలగించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా అకాల వృద్ధాప్యాన్ని తొలగించడానికి అలాగే ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి.. అయితే చర్మ సంరక్షణ కోసం శ్రద్ధ వహించేటప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం..


కావలసిన పదార్థాలు:
రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ,
ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ గుడ్డులోని పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పండిన అవకాడో గుజ్జు..

తయారీ విధానం:
పెట్రోలియం జెల్లీ కరిగేవరకు కాసేపు వేడి చేయండి. ఇక ఇది గోరువెచ్చగా మారిన తర్వాత అందులో తేనె వేసి బాగా కలపాలి. ఇక పైన చెప్పిన విధంగా మిగిలిన పదార్థాలన్నీ వేసి చివర్లో గుడ్డులోని పచ్చసొన కూడా జోడించండి. ఇక ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్ వచ్చేవరకు కలపాలి..


దీనిని ముఖానికి ఎలా ఉపయోగించాలి అంటే, మొదట ఈ మిశ్రమాన్ని కనీసం ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక అంత లోపు మీ ముఖాన్ని బాగా కడిగి శుభ్రపరచండి. తర్వాత మీ ముఖం మీద ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. ఇక మీ ఉంగరపు వేలు తో వృత్తాకార కదలికలతో మసాజ్ చేయండి. 30 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మినరల్ వాటర్ లో ఒక కాటన్ బాల్ అద్ది, దానిని శుభ్రంగా తుడవండి.. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులను కూడా తొలగించుకోవచ్చు. అలాగే ముడతలు కూడా అతి తక్కువ కాలంలో తగ్గిపోవడాన్ని గమనించవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: