ఇక ప్రస్తుత వేసవి కాలంలో అధిక వేడి కారణంగా మజ్జిగ త్వరగా పుల్లగా మారిపోతుంటాయి. దాంతో ఆ మజ్జిగను తాగలేక చాలా మంది బయట పారబోసేస్తుంటారు. కానీ, ఇకపై మీరు అసలు అలా చేయకండి.ఎందుకంటే, పుల్లటి మజ్జిగ జుట్టుకు ఇంకా చర్మ సౌందర్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్‌తో బాధ పడే వారికి పుల్లటి మజ్జిగ ఎంతగానో సహాయపడుతుంది. మరి ఇంతకీ జుట్టుకు పుల్లటి మజ్జిగను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ముందుగా బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని దాని తొక్క తొలగించి స్పూన్ సాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో స్మాష్ చేసుకున్న అరటి పండు ఇంకా అలాగే ఒక ఎగ్ వైట్‌, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఇంకా అర కప్పు పుల్లటి మజ్జిగ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.


రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో బాగా తలస్నానం చేయాలి. ఇక ఇలా వారంలో ఒకసారి కనుక చేశారంటే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.అలాగే మీ చర్మానికి కూడా పుల్లటి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్‌,ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి,ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఐదు టేబుల్ స్పూన్ల పుల్లటి మజ్జిగ, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌ ఇంకా అలాగే రెండు చుక్కలు విటమిన్ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి..ఒక ఇరవై నిమిషాల తరువాత వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇక ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే చర్మంపై మచ్చలు ఇంకా ముడతలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: