ఇక ప్రస్తుతం తక్కువ వయస్సు ఉన్నవారు కూడా తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వున్నవారు తెల్ల జుట్టును దాచడానికి హెయిర్ డై లేదా రసాయన రంగును ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇది తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చవచ్చు, కానీ ఫలితంగా చాలా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకునే టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..అల్లం ఇంకా తేనెను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు ఈజీగా నల్లగా మారుతుంది. తురిమిన అల్లంను తీసుకొని దానిని తేనెతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించాలి.ఇక ఒక అరగంట తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా మనం ఇంట్లో రెగ్యులర్ గా వాడే కొబ్బరి నూనె కూడా జుట్టును సహజంగా బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసంని మిక్స్ చేసి జుట్టుకు బాగా మసాజ్ చేయాలి.


ఇలా రెగ్యులర్ గా చెయ్యడం వల్ల నెరిసిన జుట్టు పెరగడం తగ్గుతుంది.ఇంకా అలాగే జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి బ్లాక్ టీని కూడా ఉపయోగించవచ్చు. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కోసం, ఒక పాత్రలో నీరు తీసుకుని, ఇక అందులో 2 చెంచాల బ్లాక్ టీ ఇంకా ఒక చెంచా ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత దానిని ఫిల్టర్ చేసి చల్లార్చి మీ జుట్టుకు బాగా పట్టించాలి.ఇంకా అలాగే ఉల్లిపాయ రసం కూడా తెల్ల జుట్టును చాలా ఈజీగా తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.ఉల్లిపాయ రసం ఇంకా అలాగే నిమ్మరసంలో ఆలివ్ ఆయిల్ ని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇక ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరగడంతో పాటు నెరిసిన జుట్టు కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: