మనీ లాండరింగ్ చట్టాలను కఠినంగా అమలు చేయడానికి గానూ... యుఎస్ రెగ్యులేటరీ ఏజెన్సీ అయిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ (ఫిన్‌సెన్) రెడీ అయింది.
పాకిస్తాన్ జాతీయుడు అల్తాఫ్ ఖానాని నిర్వహిస్తున్న మనీలాండరింగ్ నెట్‌వర్క్ యొక్క లావాదేవీల చిట్టాను వెలుగులోకి తీసుకొచ్చింది.
అంతర్జాతీయ ఉగ్రవాది... దావూద్ ఇబ్రహీం కు సంబంధించి న్యూయార్క్ లోని స్టాండర్డ్ చార్టర్డ్
బ్యాంక్ దాఖలు చేసిన అనుమానాస్పద లావాదేవీల మీద దృష్టి పెట్టింది.
ట్రాన్స్-కాంటినెంటల్ అండర్కవర్ ఆపరేషన్ తరువాత 2015
సెప్టెంబర్ 11 న ఖానాని
పనామా విమానాశ్రయంలో
అరెస్ట్ చేసారు. అతని నిర్బంధం జూలై
2020 లో ముగిసింది. అయితే అతన్ని
పాకిస్తాన్ కు అప్పగించారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాని అతని నుంచి అందిన సమాచారం ప్రకారం దావూద్ కి సంబంధించిన అనేక విషయాలను బయటకు లాగినట్టుగా తెలుస్తుంది.