మ‌హారాష్ట్ర‌ను క‌రోనా క‌మ్మేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా
నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదకొండు రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నాగ్‌పూర్‌, పూణేతో పాటు నాందేడ్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నాందేడ్ తెలంగాణ‌కు స‌రిహ‌ద్దుల్లో ఉంటుంది. ఆ జిల్లా నుంచి తెలంగాణ‌కు నిత్యం రాక‌పోక‌లు ఎక్కువుగా ఉంటాయి. దీంతో అక్క‌డ‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం నుంచి వచ్చే వారికి కోవిడ్ టెస్ట్ లను నిర్వహిస్తుంది. ఇక్క‌డ ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు కూడా ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇక ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు జిల్లాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: