హైదరాబాద్ కి అతి దగ్గర లో  భూకంపం సంభవించింది. భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ లో ఇటీవల భూమి కంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోమవారం ఉదయం హైదరాబాద్ లో నమోదైన భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.0 గా నమోదయింది. హైదరాబాద్ నుంచి 156 కిలోమీటర్ల దూరం లో మరియు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సంఘటన లో ప్రాణ నష్టం పెద్దగా సంభవించలేదు, అలాగే భూకంప తీవ్రత తక్కువగా ఉన్న కారణంగా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం తక్కువగా ఉంది. ఏది ఏమైనా అధికారులు దీనిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్ కి దక్షిణం వైపు ఈ ఎర్త్క్వేక్ వచ్చినట్టు గా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) నిర్దారించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: