హుజురాబాద్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ హుజురాబాద్ పై వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈటల రాజేందర్ తరపున కేంద్ర మంత్రులు ప్రచారానికి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి వేడి వాతావరణంలో ఓ వాట్సాప్ చాట్ సంచలనంగా మారింది. ఈటల రాజేందర్ బావమరిది జమునా రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి హుజురాబాద్ ఎలక్షన్ పై ఆరా తీసినట్టు చాటింగ్ కలకలం రేపుతోంది. మధుసూదన్ రెడ్డి ఫౌల్డ్రీ పార్ట్నర్ తో చేసిన వాట్సాప్ చాట్ అంటూ వైరల్ అవుతోంది.

అందులో దళిత బంధు స్కీం పై మధుసూదన్ ఆరా తీసినట్టు ఉంది. నారాయణగూడ లో 10 కోట్లు తీసుకో అంటూ చెప్పినట్టు కల్పిస్తోంది. అంతేకాకుండా కమలాపూర్ లో నాలుగు కోట్లు ఇచ్చి మిగతావి జమ్మికుంటలో ఇవ్వాలంటూ సూచించినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా పీఆర్వోలు, పిఏ లు అసంతృప్తితో ఉన్నారని చాటింగ్ లో కనిపిస్తోంది. అయితే దీని పై ఈటల రాజేందర్ టీం స్పందించింది. ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతేకాకుండా తాము ఫేక్ సృష్టిస్తే టిఆర్ఎస్ తట్టుకోలేదని ఈటల రాజేందర్ టీమ్ వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: