బ్రెయిన్ డేటా బదిలీ సంస్థ సింక్రోన్ తన మెదడు చిప్ యొక్క హ్యూమన్ ట్రైల్స్ ప్రారంభించడానికి ఎఫ్ డి ఎ నుండి గ్రీన్ లైట్ సంపాదించిందని బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరంలోనే న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌లో ఈ ట్రైల్స్ ప్రారంభమవుతాయి. తీవ్రమైన పక్షవాతం ఉన్న రోగులలో స్టెంట్రోడ్ మోటార్ న్యూరో ప్రొస్థెసిస్ అని పిలువబడే దాని ప్రధాన ఉత్పత్తి యొక్క భద్రత మరియు సమర్థతను ఈ అధ్యయనం పరిశీలిస్తుంది . డిజిటల్ పరికరాన్ని నియంత్రించడానికి మెదడు డేటాను ఉపయోగించడానికి దాని పరికరం రోగులను అనుమతిస్తుంది అని సింక్రోన్ భావిస్తోంది. కమాండ్ ట్రయల్ అని పిలువబడే ఈ అధ్యయనం ఆరుగురు రోగుల మీద జరగబోతోంది. ఎలోన్ మస్క్ గతంలో ఒక కోతిలో న్యూరాలింక్ చిప్‌ను ఉపయోగించాడు, ఆ తర్వాత దానితో వీడియో గేమ్స్ ఆడించేవాడు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ సింక్రోన్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 20 మాత్రమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: