దుమ్ముగూడెం కేస్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఏడుగురు గురు మావోయిస్ట్ నేతల పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చింది దర్యాప్తు సంస్థ. ముత్తు నాగరాజు, కొమ్మరజు కనక్కయ్య, సారయ్య, హిడ్మా,  సాంబయ్య, మడకం కోసి, వల్లేపు స్వామి పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా మే 2న కేసు నమోదు చేసారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచెందుకు కుట్ర పన్నారు అని పేర్కొన్నారు. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

 ప్లాన్ సఫలం కోసం భారీగా నిధులు సమకూర్చింది హిడ్మా అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టుల నుండి 500 కేజీల బూస్టర్ ల తో పట్టు 400 జెలిటన్ స్టిక్ లు, భారీగా డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు అని గుర్తించారు. అటవీ అధికారుల పేరుతో వాహనాల్లో పేలుడు సామాగ్రి తరలించారు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులో హిడ్మా, ఇతర అగ్ర నేతలకు ఆయుధాలు తరలించారు అని గుర్తించారు. నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు చేసింది.

ఛార్జీషీటులో ఏ1గా ముత్తు నాగరాజు పేరును ప్రస్తావించింది ఎన్ఐఏ. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో భారీగా పేలుడు పదార్ధాలు, అందుకు సంబంధించిన అనేక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో లైసెన్స్‌ ఉన్న వారి నుంచి జిలిటెన్‌ స్టిక్స్‌, కేబుల్స్‌, ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, నాన్‌ ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, ఫ్యూజు వైర్లు కొనుగోలు చేసారు అని గుర్తించారు. మావోయిస్టు నేత హిడ్మ వద్దకు చేరవేసే క్రమంలో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో పోలీసులకు పలువురు వ్యక్తులు చిక్కారు. ఇక దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నామని తెలిపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: