నరేంద్ర మోదీ మరోసారి అంతర్జాతీయంగా తాను తిరుగులేని నేతనని రుజువు చేసుకున్నారు. ఏకంగా 75 శాతం ప్రజామోదంతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రపంచ నాయకులందరికంటే ఎక్కువ జనాదరణ ఉన్న నేతగా మోదీనే ముందున్నారని ఈ సంస్థ తెలిపింది. మొత్తం 22 మంది దేశాధినేతల్లో మోదీ అందరికంటే ఎక్కువగా రేటింగ్‌ తెచ్చుకున్నారు.


మోదీ తర్వాత రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ ఉన్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో 54 శాతంతో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 41 శాతం రేటింగ్‌తో 5వ స్థానంలో నిలిచారు. కెనడా ప్రధాని  జస్టిన్‌ ట్రుడో 39 శాతం రేటింగ్‌ దక్కించుకోగా..  జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతం రేటింగ్ సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: