సింగరేణి విషయంలో కేంద్రం చేస్తున్న కుట్ర చేస్తోందని టీఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కుట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఎందుకు అర్థం కావట్లేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఇదే ప్రశ్న వేశారు. సింగరేణికి బొగ్గుగనులు దక్కకుండా చేసేందుకు వీలుగా కోల్‌ బ్లాక్స్‌ను వేలంపాట ద్వారా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా కేంద్రం ముందుకెళ్తోందని వినోద్‌ కుమార్ విమర్శించారు.


ప్రైవేటీకరణ, వేలంపాట మధ్య ఉన్న తేడాను సంజయ్ తెలుసుకోవాలని వినోద్‌ కుమార్ సూచించారు. సింగరేణిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఆగస్టు10న జరిగిన వేలంపాటలో సత్తుపల్లి కోయలగూడెం మూడో కోల్ బ్లాక్‌ను ఔరో కోల్ ప్రైవేట్ సంస్థకు అప్పగించిన వాస్తవాన్ని బండి సంజయ్ గమనించాలని వినోద్‌ కుమార్ పేర్కొన్నారు. సింగరేణికి గనులు ఇవ్వకుండా వేలం వేయడంలో దాగి ఉన్న మర్మం ఏంటో స్పష్టంచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోల్‌బ్లాక్స్ లేకుండా సింగరేణి ఏం చేయాలని వినోద్‌ కుమార్ ప్రశ్నించారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: