రాజకీయ నాయకుడు అన్నాక ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తుంటారు.. వాటిలో కొన్నే నెరవేరుస్తుంటారు. చాలా వరకూ మరిచిపోతుంటారు. జనం అడిగితే అప్పటి వరకూ ఏదో ఒక మాట చెప్పి తప్పుకుంటారు. కానీ.. టీడీపీ నేత నారా లోకేశ్ మాత్రం 24 గంటల్లో అన్నమాట నిలబెట్టుకున్నారు.

మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని పోల్కంపాడు దేవునిమాన్యం ప్రాంతంలో నారా లోకేశ్ తన సొంత ఖర్చులతో యుద్ధ ప్రాతిపదికన ఏడు రోడ్లు వేయించారు. ఈ నెల 15వ తేదీన మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేశ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుని మాన్యం ప్రాంత ప్రజలు తమ రోడ్ల దుస్థితిని లోకేష్ కి చూపించారు. దీంతో నారా లోకేశ్ .. గుంతలు పూడ్చి.. చిప్స్ వేయించి ఏడు రోడ్లను సిద్ధం చేయించారు. తమ ఇబ్బందులు తెలుసుకుని 24 గంటల్లో ఇళ్లకు వెళ్లేందుకు సాఫీగా రోడ్లను వేయించిన నారా లోకేశ్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: