తెలంగాణ గవర్నర్‌కూ, ప్రభుత్వానికి ఉన్న గొడవ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ గొడవలోకి సీపీఐ కూడా దిగుతోంది. దేశవ్యాప్తంగా గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న సీపీఐ ఛలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇచ్చింది. ఈ విషయన్ని  పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చామని కూనంనేని తెలిపారు.

గవర్నర్ వ్యవస్థ అరాచకంగా మారిందని కూనంనేని సాంబశివరావు అంటున్నారు.  కేరళ గవర్నర్‌ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారని...రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ఇబ్బందులకు గురి చేయడానికి గవర్నర్ వ్యవస్థ పనిచేస్తుందని  కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను అరెస్టు చేస్తే గవర్నర్ స్పందించడం సంతోషమన్న కూనంనేని.. షర్మిల విషయంలో స్పందించినట్లు అందరి విషయంలో గవర్నర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: