పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రసంగాన్ని ఆర్థికమంత్రి వీక్ హిందీ అని ఎద్దేవా చేయడంపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. పార్లమెంట్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి హిందీలో ప్రశ్నిస్తే... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అవహేళన చేశారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ భారీగా పతనమైందని.. 8 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రెట్టింపు స్థాయిలో అప్పులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.

హిందీ స్వచ్ఛంగా మాట్లాడలేదంటూ అవమానపరిచేలా నిర్మలా సీతారామన్‌ వ్యవహరించారన్న  కాంగ్రెస్ నేత మల్లు రవి.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ ఐసీయూలో ఉందని కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 8 ఏళ్లలో రూపాయి విలువ మార్చురీకి వెళ్లిందని.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేవు.... నోట్ల రద్దు వల్ల పరిస్థితి తలకిందులైందని  కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని.. బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తున్నారని  కాంగ్రెస్ నేత మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: