2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవు తేదీలను ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 2023 ఏడాదిలో మొత్తంగా 23 రోజులను సాధారణ సెలవుదినాలుగా పేర్కోంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ పర్వదినాలు, జాతీయ సెలవు దినాల తేదీలను సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాదున్ నబి తేదీల్లో మార్పు చేర్పులపై తదుపరి నోటిఫికేషన్ జారీ చేస్తామని కె.ఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు.

2023 జనవరి  14,15,16 తేదీల్లో వచ్చే భోగీ మకర సంక్రాంతి, కనుమ పండుగల తేదీని సాధారణ సెలవుల జాబితాలో  ప్రభుత్వం పేర్కోంది.  2023 మార్చి 22 తేదీన ఉగాది పండుగ సెలవును ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. భోగి, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి పండుగలు రెండో శనివారం, ఆదివారాల్లో వచ్చాయని  ప్రభుత్వం పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: