ఏపీ రాష్ట్రంలో అక్రమ ఆయుధాల విక్రయాల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. బళ్లారి, అనంతపురం కేంద్రంగా జరుగుతున్న ఆయుధాల దందాలో కీలక నిందితులని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుల నుంచి 18 ఆయుధాలని అనంతపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలో ఆయుధాల అక్రమ తయారీ గుట్టు వెలుగులోకి వచ్చిందని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

బెంగుళూరుకు చెందిన రౌడీషీటర్లను విచారించగా మధ్యప్రదేశ్ లో తయారీ కేంద్రం ఉందని తెలిపారని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. జంషీద్, ముబారక్, రియాజ్, అమీర్ పాషా అనే బెంగుళూరు ముఠాను డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఆయుధాలు తయారు చేస్తున్న రాజ్ పాల్ సింగ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీజీపి తెలిపారు. గతంలో హత్యలు, నకిలీ కరెన్సీ చెలామణి, ఆయుధాల విక్రయాలు, గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అనంతరపురం ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: