హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఈనెల 25న వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. దీనిపై అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం వంటివి నగరంలో సుమారు 25వేలు ఉన్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రికి తొలగించలేమని.. వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు.


అగ్నిప్రమాదంపై ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయన్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్..  భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదని తెలిపారు. భవనం నాణ్యతపై వరంగల్ నిట్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: