పరీక్ష పే చర్చలో తెలంగాణ విద్యార్థిని అక్షర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా జవహర్ విద్యాలయకు చెందిన తెలంగాణ విద్యార్థిని అక్షర బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాల్సి ఉందని మోడీని అడిగింది. దేశంలో అతి ప్రాచీన భాష తమిళ్ అని అక్షర ప్రశ్నకు ప్రధాని బదులిచ్చిన మోదీ.. కార్మికులు నివసించే బస్తీలోని ఒక చిన్నారిని ఉదాహరణగా చెప్పారు. ఎనిమిది ఏండ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళ్ మాట్లాడటం ఆశ్చర్యపరిచిందని మోదీ అన్నారు.


ఓ బస్తీలో నివసించే 8 ఏండ్ల చిన్నారి అన్ని భాషలు ఎలా మాట్లాడటం ఎలా సాధ్యమైందో తెలుసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఆమె అన్ని భాషలు మాట్లాడేందుకు కారణం ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వారు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారున్నారని మోదీ అన్నారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక దగ్గర నివసించడంతో వారితో నిత్యం మాట్లాడుతూ ఆ చిన్నారి అన్ని భాషలు నేర్చుకుందని మోదీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: