బెర్లిన్ లో జరుగుతున్న ప్రపంచ పర్యాటక, సాంస్కృతిక ప్రదర్శనలో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రాష్ట్ర పర్యాటక స్టాల్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ బెర్లిన్ లో రాష్ట్ర స్టాల్ ను ప్రారంభించారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల వివరాలను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, బుద్ధవనం, తదితర పర్యాటక ప్రదేశాల నమూనాలు ప్రదర్శనలో ఉంచారు.

అలాగే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను తెలంగాణ టూరిజం స్టాల్ వద్ద నిర్వహించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్... వాటికి సరైన ప్రమోషన్ కల్పించడం ద్వారా రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి వేదికలపై తెలంగాణ టూరిజం ప్రమోషన్ నిర్వహించారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా ఇప్పటికే పలు సంస్థలు గుర్తించి అవార్డులు అందిస్తున్నాయని మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: