పాలన వికేంద్రీకరణ.. ఇది ఏపీ సీఎం జగన్ నోట తరచూ వినిపించే మాట. ఆ నినాదం మేరకే మూడు రాజధానులు అంటూ జగన్ కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వికేంద్రీకరణ అంటున్నారు. దీని ద్వారా పౌరులకు మరింత వేగంగా ఫలాలు అందుతాయంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలాఖర్లో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖా మంత్రి కేటీ రామారావు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపై ఉన్నతాధికారుల నుంచి మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డు పాలన వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనా విధానం, లక్ష్యాలను మంత్రి  కేటీఆర్  వివరించారు. పాలనా ఫలాలు ప్రజలకు అందించాలన్న ఉన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటయిందని... ఈ దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పరిపాలనను వికేంద్రీకరించి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినట్లు  కేటీఆర్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: