దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ మధ్యతరగతి ప్రజలకు.. పేద ప్రజలకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇంకా ఇందులో క్యాన్సర్ పాలసీ ఉన్న సంగతి విదితమే. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్యాన్సర్ వ్యాధి ఎవరికీ రాకూడదు.. కానీ ఎవరికైనా వచ్చింది అంటే మాత్రం వైద్యం చేయించుకోవడానికి ఎంతో డబ్బులు ఖర్చవుతాయి. కొందరికి అయితే సంపాదించిన ఆస్తులు అన్ని ఈ క్యాన్సర్ చికిత్సకే సరిపోతాయి.

 

అయితే అలాంటి సమయ్ంలో ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకే ఎల్ఐసీ ఓ పాలసీని తీసుకొచ్చింది. అత్యంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అయ్యేలా ఈ పాలసీ ఉంది. క్యాన్సర్‌కు చికిత్స ప్రారంభమైన దగ్గరి నుండి ఎల్.ఐ.సీ. పాలసీ డబ్బులు చెల్లిస్తుంది. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ బెనిఫిట్స్ అంటూ ఏం ఉండవు.

 

అయితే ఎవరు ఈ పాలసీ ప్లాన్స్ తీసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 20 నుండి 65 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. అయితే ఈ పాలసీ గరిష్టంగా 75 ఏళ్ల వయసు వరకు పాలసీ వర్తిస్తుంది. అయితే దీనికి కనీసం రూ.10 లక్షలకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.50 లక్షల మొత్తానికి పాలసీ పొందవచ్చు.. ఇంకా ఈ క్యాన్సర్ పాలసీ టర్మ్ 10 నుండి 30 ఏళ్ల పాటు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: