ఇక చెట్ల పెంపకం ద్వారా కూడా మీరు ఎన్నో బంపర్ లాభాలను గడించవచ్చు. అయితే దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అయితే ఈ వ్యాపారంలో మీకు ఓపిక కూడా చాలా అవసరం.ఎందుకంటే నాటిన చెట్లు అనేవి 8 నుంచి 10 సంవత్సరాలలో సిద్ధంగా ఉంటాయి. ఇక మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఈ వ్యాపారం అనేది మీకు బాగా నచ్చుతుంది. చెట్ల పెంపకంలో పెట్టుబడి పెట్టడం రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. చెట్లు పెరగడానికి సమయం తీసుకున్నప్పటికీ చాలా మంచి లాభాలను అందిస్తాయి. మార్కెట్‌లో కూడా ఈ 4 చెట్లకి బాగా డిమాండ్‌ ఉంది.ఇక వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1. టేకు చెట్ల పెంపకం.. ఇక ఈ టేకు చెట్ల పెంపకం రైతులకు ఎంతగానో మేలు చేస్తుంది. టేకు కలపకు మార్కెట్‌లో ఎల్లప్పుడు కూడా డిమాండ్‌ ఉంటుంది.ఎందుకంటే ఇది చాలా బలమైన కర్ర. టేకు చెట్లను పెంపొందిస్తే మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు.


2. గంధపు చెట్ల పెంపకం.. అలాగే గంధపు చెట్లు అత్యంత ఖరీదైన చెట్లలో ఒకటి. దీని కలపకి చాలా పెద్ద ధర పలుకుతోంది.ఈ గంధం చెక్కను మార్కెట్‌లో కిలో 27 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చందనం చెట్ల పెంపకం ద్వారా కూడా మంచి లాభం పొందవచ్చు.


3. మహోగని చెట్టు.. ఇంకా మహోగని చెట్టు విలువైన చెట్లలో ఒకటిగా చెబుతారు. ఈ చెట్టులోని దాదాపు ప్రతి భాగం కూడా చాలా విలువ కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే సాధనం అని కూడా చెప్పవచ్చు. దీని కలప ఓడలు, ఫర్నిచర్, ప్లైవుడ్, అలంకరణలు ఇంకా అలాగే శిల్పాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.


4. నీలగిరి చెట్టు.. ఇంకా అలాగే మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు ఇరువైపులా ఎత్తైన పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఇందులో అయితే ఎక్కువగా నీలగిరి చెట్లే ఉంటాయి. ఇవి పనికి రాని చెట్లని చాలా మంది కూడా భావిస్తారు. కానీ వీటితో ఎన్నో బోలెడు లాభాలున్నాయి. ఇక ఇవి ఆస్ట్రేలియా మూలానికి చెందిన చెట్లు. అలాగే మనదేశంలో కూడా వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ నీలగిరి చెట్లను కనుక సాగుచేస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇంకా ఈ చెట్ల సాగుకు పెద్దగా ఖర్చు కూడా కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: