ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులు వున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో వుంది. గౌతమ్ అదాని, ముఖేష్ అంబాని వంటి అపర కుబేరులు వున్నారు. వారి సంపద నిమిషానికి కొన్ని కోట్లలో ఉంటుంది. ప్రభుత్వాన్నే పోషించే సంపద వారి సొంతం. అటువంటి అపర కుబేరులు ఉన్న ఇండియాలో సొంతిల్లు లేకుండా చాలా మంది బాధ పడుతున్నారు. సొంతిల్లు కాదు కదా కనీసం తిండికి గతి లేని వాళ్ళు కూడా వున్నారు. సరే ఈ విషయం పక్కన పెడితే..చాలా మందికి కూడా సొంతిల్లు అనేది కల. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు అయితే సొంతిల్లు వుండాలని కల. కానీ చాలా మందికి ఆర్ధిక సమస్యల కారణంగా ఇల్లు కట్టుకోడానికి బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును పెంచింది. ఆ వెంటనే అన్ని బ్యాంకులు కూడా గృహ రుణాల రేట్లను పెంచాయి.


ఇది నిజంగా మధ్య తరగతి కుటుంబాలకు షాకింగ్ విషయం అని చెప్పాలి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (EBLR)ని ఆగస్టులో పెంచింది. ఈ పెంపుతో ఎస్బీఐ వడ్డీ రేటు 8.05 శాతానికి చేరుకుంది. గతంలో ఈ రేటు 7.55 శాతంగా ఉండేది.ఐసిఐసిఐ బ్యాంక్ ఆగస్టు నుంచి వడ్డి రేట్లను పెంచింది. ICICI బ్యాంక్ ప్రస్తుతం 8.85 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.బ్యాంక్ ఆఫ్ బరోడా  రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఆగస్టు 6, 2022 నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం రిటైల్ రుణాలపై 7.95 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.కెనరా బ్యాంక్ రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇంతకుముందు ఈ రేటు 7.80 శాతం ఉండగా, దానిని 8.30 శాతానికి పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: