ప్రతి ఒక్కరిని ఇప్పుడు వేధిస్తున్న సమస్య వెంట్రుకలు రాలిపోవడం. తీవ్రమైన పని ఒత్తిడి,ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ సరైన విశ్రాంతి ఉండడం లేదు. ఈ సమస్యలతో అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం వెంట్రుకలపై పడుతుంది. ఆడవారిలోనూ, మగవారిలోనూ వెంట్రుకలు ఊడిపోయి, బట్టతల సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, బట్టతల సమస్య నుంచి బైట పడవచ్చు. వారానికి నాలుగుసార్లు తలకు తప్పకుండా నూనె రాయాలి. ఇంట్లో ఉండే వారు అయితే, ఆముదం లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. బైట తిరిగేవారు, ఆఫీసులకు వెళ్లే మహిళలు ఆలివ్ ఆయిల్ రాసుకోవచ్చు. ఇది జిడ్డు ఉండదు కనుక మొఖమంతా నూనె నూనెగా ఉండదు. వారానికి రెండు సార్లు తలంటు స్నానం చేయాలి. తలస్నానం చేయడానికి గంట ముందు గోరువెచ్చని నూనెతో తలకు మర్థన చేయాలి. షాంపూల వాడకం తగ్గించి కుంకుడుకాయలు, శీకాయలను ఉపయోగించాలి. గోరింటపూలు, ఆకులు దంచి రసం తీసి కొబ్బరి నూనెతో కాచి, వడపోయాలి. ఆ నూనెను తలకు రాసుకుంటే, వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి, జుట్టు రాలడం తగ్గుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: