పుచ్చకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో రుచికరమైన పండు ఇది. ఇది బాడీని చాలా కూల్‌గా ఉంచుతుంది.ఇక పెరుగు కూడా శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. కొన్ని పుచ్చపండు ముక్కలు తీసుకొని వాటిలో పెరుగును కలిపి ఆ రెంటిని మిక్సీ పట్టిన తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.ఇక అలాగే 20 నిమిషాలు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కదిగితే ముఖం ముదురువ్వకుండా చాలా తాజాగా ఉంటుంది.ఇక నిమ్మరసం కూడా ముఖాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ ముఖంపై ఉండే నూనె లాంటి జిడ్డును నిమ్మ రసం తొలగిస్తుంది.అలాగే కలబంద కూడా మీ చర్మానికి అవసరమైన తేమను అందించి పొడిబారకుండా మృదువుగా మారుస్తుంది. ఇక ముఖం ముదురువ్వకుండా ఉండటానికి కొంత కలబంద గుజ్జును తీసుకొని  దానికి నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం చాలా తాజాగా ఉంటుంది.


ఇక చర్మ సంబంధిత సమస్యలకు పుదీనా చెక్ పెడుతుంది.అలాగే చర్మంలో ఉండే అదనపు నూనెలను ముల్తానీ మట్టి తొలగిస్తుంది. ఈ రెండు పదార్ధాలని మిక్సీలో వేసి చక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ముదురు కాకుండా చాలా తాజాగా ఉంచుతుంది.ఇక అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనెకు రెండు లేదా మూడు దోస కాయ ముక్కలు కలిపి మెత్తగా చేసుకోవాలి.మెత్తగా చేసుకున్న ఆ ప్యాక్‌ను ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకుంటే.. ముఖం ముదురు కాకుండా తాజాగా మెరిసిపోతుంది.


ఇక గంధం కూడా చర్మానికి చాలా మంచిది. ఇది ముఖాన్ని మరింత మెరిసేలా చేస్తుంది. ఇక అలాగే రోజ్ వాటర్ కూడా చర్మాన్ని చాలా తాజాగా ఉంచుంది. ఇక చర్మం తాజాగా ఉండేందుకు రెండు టీ స్పూన్‌ల గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ పోసి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఆ ప్యాక్ పూర్తిగా ఎండిపోయిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ లు వేసుకుంటే మీ ముఖం ముదురు కాకుండా తాజాగా అయ్యి సౌందర్యం మరింత పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: