ప్రస్తుత రోజుల్లో పట్టణీకరణ బాగా పెరిగిపోవడంతో ఉపాధి అవకాశాలు కోసం గ్రామాల నుంచి వస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. అందుకు తగ్గట్టే  ఒకప్పుడు ఉన్న విశాలమైన ఇళ్ళు  కట్టడాలు బదులు వాటి స్థానంలో అపార్టుమెంట్లు రావడంతో ఇంటి బయట ఉండే మొక్కలు గదుల్లో, బాల్కనీల్లో ఒదిగిపోతున్నాయి మరియు ఇంట్లో పచ్చదనాన్ని పెంచుతున్నాయి. 



మనం పెంచుకునే మొక్కల్లో ఆరుబయట ఖాళీ స్థలాల్లో పెంచుకునేవి ఒక రకమైతే కుండిల్లో పెంచుకునేవి ఒక రకం. వీటికి భిన్నంగా సన్నని తీగకు వేలాడ గట్టిన , ఖాళీ గాజు గ్లాసులో పెట్టిన, ఇసుక లేదా ద్వారాల మధ్య అమర్చిన అక్కడ బతికే మొక్కలు బహుళ సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎయిర్ ప్లాంట్స్ అంటారు. 

 


ఎయిర్ ప్లాంట్స్ గా పిలిచే ఈ మొక్కలు గాలిలోనే పోషకాలను పీల్చుకుంటూ జీవిస్తాయి. వీటిని పెంచేందుకు మిగిలిన మొక్కల్లాగా మట్టి అవసరం లేనే లేదు. ఇక నీళ్లయితే వారానికి ఒక్కసారి కొంచెం చల్లితే చాలు, బతుకుతాయి. అయితే వీటి అసలు పేరు తిల్లాoడి యా . 



చిన్న చిన్న ఆకులతో ఉండే ఈ మొక్కలు నీం, గులాబీ, పసుపు రంగుల్లో పూలు పూస్తాయి. కొన్ని రకాల మొక్కల ఆకులు కూడా ఎరుపు , పసుపు రంగుల కలగలిపి ఉంటాయి. ఎడారి మొక్కలైన కాక్టస్ రకాలను పోలి కనిపించే వీటిని వేలాడే మొక్కలు గా పెంచుకుంటారు. అంటే ఖాళీగా  ఉండే బుట్టల్లాంటి వాటిలోనూ తీగలు చుట్టి వేలాడదీస్టూనూ వీటిని పెంచుతారు. అంతేకాకుండా రంగు రంగుల ఇసుకా గడ్డి కలిపిన టెర్రేరియంలలోనూ వీటిని అమర్చుతారు. 




ఈ ఎయిర్ ప్లాంట్స్ లోనే వాండా ప్లాంట్ గా పిలిచే ఆర్కిడ్ మొక్కలు ఉంటాయి. ఊదా, గులాబీ, తెలుపు, నారింజ, పసుపు రంగుల్లో గుత్తలుగా పూసే ఈ ఆర్కిడ్ పూల మొక్కలు మన ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: