నందమూరి బాలకృష్ణతో 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా కు 'డేంజర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి.ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. దీనికి 'టార్చ్ బేరర్' అనే పేరును బోయపాటి ఖరారు చేసినట్టు సినీ వర్గాలు అంటున్నాయి.