అన్నగారు వస్తారు అనే సినిమా విడుదల ఆలస్యం కావడానికి అఖండ 2 సినిమానే కారణమని వినిపిస్తున్నాయి. అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత డిసెంబర్ 12న రిలీజ్ చేశారు చిత్ర బృందం. ముఖ్యంగా ఈ సినిమా పైన విపరీతమైన క్రేజ్ ఉండడంతో డిసెంబర్ 12 న విడుదల కావాల్సిన చాలా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా అన్నగారు వస్తారు సినిమా కూడా పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నలన్ కుమార్ దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.
అన్నగారు వస్తారు సినిమా పై కోలీవుడ్లో వినిపిస్తున్న వార్తలు ప్రకారం ఈ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా తమ వద్ద తీసుకున్నటువంటి అప్పును చెల్లించాలని అంతవరకు సినిమా విడుదల చేయకూడదని ఇండస్ట్రియల్ లిస్ట్ అర్జున్ లాల్ సుందర్ దాస్ తరపున పిటిషన్ దాఖలు అయినట్లుగా తెలుస్తోంది. దీంతో కోర్టు మరోసారి విచారించిన అనంతరం ఇప్పటికే విధించిన స్టే ని కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో సినిమా పోస్ట్ పోన్ అయినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి