ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన ఆ మహా క్షణం వచ్చింది. అఖండ 2 థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలై, మొదటి షో నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా మొదలైన క్షణం నుండి చివరి ఫ్రేమ్ వరకు థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఎనర్జీ, హంగామా, అరుపులు, కేకలు ఆగిపోకుండా కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే ఒకే ఒక న్యూస్— “అఖండ 2 సెన్సేషన్… బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది!” అని ట్రెండ్స్ ఊపందుకున్నాయి.ప్రేక్షకులు ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్న సీన్ ఏదంటే… బాలయ్య ఇంట్రడక్షన్! ఆ సీన్ థియేటర్స్‌లో వచ్చిందే గానీ, ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లూ, హర్షధ్వానాలూ, సెల్యూట్లూ చేసేశారు. “ఇదే అసలు బాలయ్య… ఇదే మాస్‌కి దేవుడు!” అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దానికి తోడు ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సినిమా హైప్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లిందని ఒక్క మాటగా అందరూ చెబుతున్నారు. ఆ ట్విస్ట్‌ను ఆ రేంజ్‌లో చూపించగలిగేది బోయపాటి శ్రీను మాత్రమే అని అభిమానులు గర్వంగా కామెంట్ చేస్తున్నారు.


సినిమాలో బాలయ్య–సంయుక్త మీనన్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్‌ను ఒక హంగామా జాతరగా మార్చేశాయి. ఆ ఇద్దరి కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్‌కి పండుగే పండుగ. ప్రత్యేకంగా అఘరా పాత్రలో బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్, ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి ఎక్స్‌ప్రెషన్ తెరమీద కనిపించగానే ప్రేక్షకులో కలకలం రేగిపోయింది. “ఇలాంటి ఫైర్‌ఫుల్ డైలాగ్స్‌ను డెలివర్ చేయడం బాలయ్యకే సాధ్యం” అని సోషల్ మీడియాలో రాస్తున్నారు. పులులే  కాదు, ప్రేక్షకుల గుండెల్లా గర్జించేలా ఆ డైలాగ్స్ పనిచేశాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.



ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే ఒక మాట —"అఖండ… అఖండ… అఖండ… ఇదే బాలయ్య సింహ గర్జన!"ఫ్యాన్స్, నెటిజన్స్, సినీ ప్రేమికులు అందరూ కలిసికట్టుగా అఖండ 2ను ఆకాశానికెత్తేస్తున్నారు. మొదటి రోజు, మొదటి షో నుంచే తుపాను సృష్టించిన ఈ సినిమా వచ్చే రోజులలో బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: