తెలంగాణ మాదిరిగానే బీజేపీ పార్టీ ఏపీ లో బలపడాలని చూస్తుంది.. ఇప్పటికే టీడీపీ పార్టీ ను సమూలంగా తుడిచిపెట్టుకుపోయేలా చేయడంలో వైసీపీ తో పాటు బీజేపీ కూడా ఓ చేయి వేసింది.. దాంతో బీజేపీ తప్ప వేరే ఏ పార్టీ కి ఏపీ లో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.. అయితే ఈ తిరుపతి ఎన్నికల్లో వైసీపీ కి కూడా ఝలక్ ఇవ్వాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది.. నిజానికి ఉప ఎన్నికల విషయంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంటుంది. విపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఉపఎన్నిక గెలవాలని అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా భావిస్తుంది.