పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాల సంవత్సరాలు అవుతున్నా ఎందుకో అయన సరైన ముద్ర వేయలేకపోయారు. సినిమాల్లో ఆయనకున్న ఫ్యాన్ క్రేజ్ రాజకీయాల్లో లేదు.. ఎప్పుడు ఎదో ఒక పార్టీ తో పొత్తు, లేదా సపోర్ట్ గా ఉండడం వల్ల సదరు పార్టీ పవన్ ఇమేజ్ ని ఉపయోగించుకుని ఎదుగుతుంది తప్పా జనసేన మాత్రం అక్కడే ఉంచి పవన్ కు రాజకీయంగా ప్రముఖ స్థానం ఎప్పుడు కలగట్లేదు. ఇక మొన్నటి ఎన్నికల ఫలితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే..