'వకీల్ సాబ్' చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి వచ్చి అన్నీ తారుమారు చేసింది. ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుస్తుండటంతో 'వకీల్ సాబ్' ని సంక్రాంతి బరిలో నిలపనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు రిలీజ్ డేట్ మీద అప్డేట్ ఇవ్వలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' గురించి అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.