నలంద కిషోర్ అరెస్ట్ సరికాదని, ఆయన అరెస్ట్ ని తాను ఖండిస్తున్నా అని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మఫ్టీ లో ఉన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అంత సీన్ లేదు అని అన్నారు. ఏమైనా ఉంటే తనను టార్గెట్ చెయ్యాలి గాని తన సన్నిహితులను కాదు అని స్పష్టం చేసారు.

 

వాట్సాప్ లో మెసేజ్ లు ఫార్వార్డ్ చేశా అని అరెస్ట్ చేసారని అసలు వేలాది మంది వేలాది మెసేజ్ లను ఫార్వార్డ్ చేస్తూ ఉంటారని వారు అందరిని అరెస్ట్ చేస్తారా అని ఆయన నిలదీశారు. దేశ ద్రోహం చేయలేదు అని రక్షణ వ్యవహారాలను లీక్ చేయలేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. కాగా ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్ళగా అధికారులు అనుమతి ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: