ఒడిస్సా రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసులు గత కొన్ని రోజుల నుండి  రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ నియంత్రించేందుకు ఒడిషా ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చి చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. 

 


 గడచిన 24 గంటల్లో ఒడిషా రాష్ట్రంలో ఏకంగా 591 కరోనా  పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా ప్రభావం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నా ఒడిశాలో  ప్రస్తుతం క్రమక్రమంగా పాజిటివ్  కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: