కర్నూలు జిల్లా కోడుమూరు లో తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 250 కోట్ల ఖర్చు చేసి తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తున్నారు అని ఆయన అన్నారు. కరోనా పేరిట నది స్నానం లేకుండా చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో నది స్నానానికి అనుమతి ఉంది వారికి లేని కరోనా మనకే వస్తుందా అని ఆయన విమర్శలు చేసారు. ప్రభుత్వం హిందూత్వాన్ని కాలరాస్తుంది అని మండిపడ్డారు.

పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక 5 వేలు,లారీ ఇసుక 50 వేలు ఉంది అని అన్నారు. గుండ్రేవు ఎత్తి పోతల పథకం కోసం రైతులతో కలిసి జనవరిలో పాదయాత్ర చేస్తాము అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారు. నంద్యాల సలాం కేసు దీనికి ఉదాహరణ.ఏపార్టీ వారికైనా  న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల పై ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: