వారంతా సామాన్య కూలీలు. ప్రతి రోజూ ఏదో ఒక పని దొరికితే తప్ప వారి కడుపు నిండదు. అలాంటి వారిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంది ఓ ట్రక్.ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 15 మంది వసల కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం సూరత్ తరలించారు.ఈ దారుణం గుజరాత్ రాష్ట్రం సూరత్లోని కిమ్ చార్ రాస్తా వద్ద చోటుచేసుకుంది.


ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ ట్రక్ దూసుకెళ్లడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రక్ వచ్చిన సమయంలో... 18 మంది కూలీలు... రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్నారు. తెల్లవారు జామున మంచు బాగా కురుస్తున్న సమయంలో... వారంతా ముడుచుకొని నిద్రపోతుంటే... మృత్యు వాహనం తరుముకుంటూ వచ్చింది. ట్రక్కు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో రెప్పపాటులో దారుణం జరిగిపోయింది. ఓ ట్రాక్టర్ ను ఢీకొట్టిన ట్రక్కు.. అదుపుతప్పి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. మృతులను రాజస్థాన్‌లోని బాన్స్‌వాడాకు చెందిన వారిగా గుర్తించారు.మృతులు, బాధితులంతా రాజస్తాన్... బన్స్‌వారా జిల్లాకు చెందినవారు .


రోజువారీ కూలి పనుల కోసం గుజరాత్ వచ్చారు. ఈ ప్రమాదం జరగడానికి అసలు కారణం ఓ ట్రాక్టర్ అని చెబుతున్నారు.ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదం జరగడానికి అసలు కారణం ఓ ట్రాక్టర్ అని చెబుతున్నారు. నిండుగా చెరకు గడలను మోసుకెళ్తున్న ట్రాక్టర్... అదుపు తప్పు... ట్రక్కును ఢీ కొట్టింది. దాంతో వేగంగా వెళ్తున్న ట్రక్ డ్రైవర్ దాన్ని కంట్రోల్ చెయ్యలేకపోయాడని తెలిసింది. అందువల్ల అతను రోడ్డు నుంచి ట్రక్కును ఫుట్ పాత్ వైపు నడిపించినట్లు తెలిసింది.
వ్రంగా గాయపడిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: