ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రి మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు సంచ‌లన నిర్ణ‌యాలు తీసుకున్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ స‌మావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతోన్న అత్యంత కీల‌క‌మైన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కంలో భాగంగా ఈ యేడాది క్యాలెంట‌ర్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది.

కేబినెట్‌ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. ఇక కీల‌క‌మైన ఈబీసీ నేస్తం ప‌థ‌కానికి కూడా ప్ర‌భుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: