ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా క‌ర్నూలు జిల్లా ఆస్ప‌రి మండ‌లంలోని కైరుప్ప‌ల గ్రామం మారింది. కోవిడ్‌ రూల్స్‌ని ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా తరతరాలుగా వస్తోన్నసాంప్రదాయాన్నికర్నూలు జిల్లా వాసులు కొనసాగించారు. ప్ర‌తి సంవ‌త్స‌రంలానే ఈసారి కూడా పిడకల సమరాన్ని జరుపుకున్నారు. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది తరువాత రోజు జరిగిన పిడకల సమరానికి భక్తులు భారీసంఖ్య‌లో తరలివచ్చారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. ఆచారం ప్రకారం  ఈ పిడకల సమరానికి ముందు కారుమంచి గ్రామానికి చెందిన రాజ వంశస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి బయలుదేరగానే.. స్వామి, అమ్మవారి వర్గీయులుగా విడిపోయిన జనం పిడకల రాసులపై పడ్డారు. మాస్క్‌ లు పెట్టుకోమని, భౌతిక దూరం పాటించ‌మ‌ని ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా ఎవ‌రూ లెక్క‌చేయ‌లేదు. బుధ‌, గురువారాల్లో క‌ర్నూలు జిల్లాల్లోని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో కొవిడ్ కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. పిడ‌క‌ల పండ‌గ‌లో పాల్గొన్న‌వారే క‌రోనా బారిన ప‌డుతున్నారంటూ వైద్య‌, ఆరోగ్య‌శాఖ అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఏడాది కూడా క‌ర్నూలు జిల్లా క‌రోనా కేసుల‌తో గ‌జ‌గ‌జ‌లాడిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: