ఈ మధ్య యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా పాకులాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీహార్ లోని ముజఫర్‌పూర్‌లోని పురైని బజార్ సెంట్రల్
బ్యాంక్ గేట్ సమీపంలో ఇద్దరు యువకులు
బైక్ పైన వచ్చి సెంట్రల్
బ్యాంక్ గేట్ సమీపంలో ఉన్న నగదు వ్యాన్‌ను దోచుకోవడానికి ప్రయత్నించారు. కానీ అక్కడే ఉన్న సెక్యూర్టీయ్ గార్డ్స్ అప్రమత్తంగా ఉండటమే కాకుండా డబ్బు దొంగిలించి పారిపోతున్న దుండగులను ఛేజ్ చేసి మరి పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా దుండగులు పోలీసులపై కాల్పులు జరిపి వ్యాన్ లో ఉన్న 88 లక్షలను దోచుకెళ్లే ప్రయత్నం చేసారు. సెక్యూరిటీ గార్డ్ సైతం కాల్పులు జరపగా ఒక నేరస్థుడు గాయపడ్డాడు. ప్రస్తుతం గార్డ్ మరియు దుండగుడి
కి చికిత్స జరుగుతుంది.