ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభానికి ముందే వర్షం అడ్డుతగిలింది.భారత్
న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం ఆటకం కలిగించింది. సౌతాంప్టన్‌లో ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ వర్షం వల్ల తొలిరోజు ఫస్ట్ సేషన్ రద్దు చేసినట్లు
బీసీసీఐ ట్విట్టర్‌లో వెల్లడించింది.భారత్
న్యూజిలాండ్ మ్యాచ్‌పై టీమిండియా అభిమానులు ఎన్నోఆశలు పెట్టుకున్నారు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విన్నర్‌గా భారత్ నిలవబోతుందని ఆశగా ఎదరుచూస్తున్నారు.అయితే ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి మారడంతో అభిమానుల్లో నిరాశ కలిగింది.ఆరుగురు బ్యాట్స్‌మెన్,ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు,ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది.
విరాట్ కోహ్లి కెప్టెన్‌గా, అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యహరిస్తున్నారు.