ఇథియోపియా దేశంలో మారణహోమం చోటుచేసుకుంది. టోగోగో లోని ఓ మార్కెట్ పై వైమానిక దాడి జరిగింది . ఈ ఘటనలో 80 మంది చనిపోయారు . వందలమంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గత సంవత్సరం నవంబర్నుండి ఈ దేశంలో సైనికులకు, ట్రిగే పీపుల్స్ లబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటు దళాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి .

 ఈ క్రమంలోనే వైమానిక దాడి చోటు చేసుకుంది. మార్కెట్ పై విమానం నుండి బాంబులు విసరడంతో తీవ్ర ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యం కూడా అందించకుండా సైనికులు అడ్డుపడుతున్నారు. బాధితుల కోసం ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ ను సైతం వెనక్కి పంపిస్తున్నారు.చిన్నపిల్లలను చూసి కూడా సైన్యం కనికరించక పోవడం బాధాకరం అనే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: