ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేరు వినగానే చాలా మంది బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ సినిమాను మించిన రేంజ్ లో ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ఉంటుంది అంటున్నారు సినీ జనాలు. ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో చూపించిన షూటింగ్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, నటుల హావభావాలు చూస్తే మాత్రం బాహుబలిని మర్చిపోవడం ఖాయం అంటున్నారు.

బ్రిటీష్ దొరలను చూపించడమే కాదు... అలియాభట్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ ఈ వీడియోలో హైలెట్ గా మారింది. దీనితో సినిమాలో లవ్ స్టోరీకి కూడా మంచి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు బాహుబలిలో చూపించిన విధానం చూసి ప్రపంచం షాక్ అయింది. ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో ఆ అడవుల్లో సన్నివేశాల దెబ్బకు సినిమాకచ్చితంగా విందు భోజనమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr