మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. బ‌ర్గి నియోజ‌క‌వ‌ర్గమున‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజ‌య్ యాద‌వ్ కుమారుడు విభోర్ యాద‌వ్ (17) సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ్డాడు. గోర‌ఖ్‌పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. గురువారం సాయంత్రం ఉన్న‌ట్టుండి  త‌న గ‌దిలో రివాల్వ‌ర్‌తో త‌ల‌పై కాల్చుకున్నాడు. రివాల్వ‌ర్ పేలిన శ‌బ్దం విని కుటుంబ స‌భ్యులు కంగారు ప‌డి హుటాహుటిన విభోర్ యాద‌వ్ గ‌దికి చేరుకున్నారు.

 అప్ప‌టికే త‌ల‌పై కాల్చుకోవ‌డంతో  వెంట‌నే  కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ విభోర్ మ‌ర‌ణించాడు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆసుప‌త్రికి చేరుకుని మృతుని కుటుంబానికి సానుభూతి ప్ర‌క‌టించారు.  ఆసుప‌త్రి చుట్టు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసారు పోలీసులు. విభోర్ యాద‌వ్ ఎందుకు కాల్చుకున్నాడ‌నే విష‌యంపై  మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. పోలీసులు అత‌ను రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.  ముఖ్యంగా నా త‌ల్లిదండ్రులు చాలా మంచివారు అని రాసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు గోర‌ఖ్‌పూర్ పోలీసులు.
   


మరింత సమాచారం తెలుసుకోండి: