ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బీడీఎస్ పరీక్షల్ని వాయిదా వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. కోవిడ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్ లో ఉన్నారని.. కోవిడ్ సోకిన వాళ్ళు పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తోందని తెలిసి కూడా ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలని మొండిగా వ్యవహరించడం సరికాదని బండి సంజయ్‌ అన్నారు.


విద్యార్థుల అరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు గురించి కొద్దిగా కూడా ఆలోచించరా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు పరీక్షల్ని వాయిదా వేసుకున్నాయని.. బీడీఎస్ పరీక్షల నిర్వహణపై పై కాళోజీ నారాయణరావు వైద్య విశ్వ విద్యాలయం కూడా వెంటనే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరి బండి సంజయ్‌ డిమాండ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: