టీడీపీ నేత బుద్దా వెంక‌న్నను ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంక‌న్న తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. చేతగాని ద‌ద్ద‌మ్మ‌లు, చ‌వ‌ట‌లు చంద్ర‌బాబుపై  మాట్లాడుతున్నారు. . అరేయ్ కొడాలి నాని నీ భాష ఏమిటి..  కొడాలి నాని నీ చ‌రిత్ర ఏంటి రా..?  గుడివాడ‌లో ఆయిల్ దొంగ‌వి అనే విష‌యం మ‌రిచిపోయావా.? వ‌ర్ల రామ‌య్య  లోప‌ల వేసి నిన్ను చిత‌క‌బాదాడు. పోలీసులు లేకుండా.. ప్లేస్‌, స‌మ‌యం ఫిక్స్ చేయి  కొట్టుకుందాం రా విజ‌య‌వాడ‌లో అని స‌వాల్ విసిరారు బుద్ధా వెంక‌న్న‌.

గుడివాడ‌లో వ్య‌భిచారం కంపెనీ తీసుకొచ్చావని,  నోటి దూల‌తో కృష్ణ జిల్లా మొత్తం ప‌రువు తీశావు అని.. కొడాలి నాని తోపు అయితే కెమెరా ప‌ట్టుకొని చంద్ర‌బాబు ఇంటికి వెళ్లు చూద్దాం. చంద్ర‌బాబు గేట్ తాకితే కొడాలి నాని శ‌వాన్ని పంపుతా అని ఘాటైన వ్యాఖ్య‌లు చేసారు.  మేమ‌న్నా నీ బావ‌, బావ మ‌రిదిల‌మా..? మ‌మ్ముల్ని వాడు, వీడు అంటున్నావు. కొడాలి నాకికి రాజ‌కీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అనే విష‌యం గుర్తుంచుకోవాల‌ని పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌కొడుతున్నార‌ని ప‌లువురు బుద్దావెంక‌న్న‌పై మండిప‌డ్డారు. అదేవిధంగా బుద్దా వెంక‌న్న మైల‌వ‌ర‌పు దుర్గారావు అనే వ్య‌క్తి ఫిర్యాదు చేసారు. దీంతో విజ‌య‌వాడ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు మూడు గంట‌ల పాటు పోలీసుల‌తో వాగ్వాదం చోటు చేసుకున్న త‌రువాత పోలీసులు కేసు న‌మోదు చేసారు. 153, 505, 506 సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. మ‌రొక‌వైపు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ సీఎం జ‌గ‌న్ తొత్తు అని ఆరోపించారు బుద్దా వెంక‌న్న‌. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినందుకే త‌న‌ను అరెస్ట్ చేస్తున్నారు అని పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాట‌లు వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకున్నారు బుద్దా వెంక‌న్న‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: