ఏపీ సీఎం జగన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.. పంట నష్టపోయిన రైతులకు ఇవాళ ఇన్‌పుట్‌ సబ్సిడీ నగదును విడుదల చేయబోతున్నారు. 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన వారికి ఏపీ సీఎం జగన్ ఇవాళ పరిహారం సొమ్ము విడుదల చేస్తారు. 2021 నవంబర్‌లో వచ్చిన వరదలతో నష్టపోయిన 5 లక్షల71 వేల 478 మంది రైతులకు ఈ పరిహారం సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తారు..

మొత్తం 5 లక్షల మంది రైతులకు పైగా లబ్దిదారులకు రూ. 534.77 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. వీరితో పాటు 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్‌ యంత్రసేవా పథకం క్రింద రూ. 29.51 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఈ రెండు పథకాల కింద మొత్తం రూ. 564.28 కోట్ల నగదును రైతుల ఖాతాలో ఏపీ సీఎం జగన్ ఇవాళ జమ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: